వ్యాపారంలో ఎదిగి.. సామాజిక సేవలో ఒదిగిన కొలసాని శ్రీనివాసరావు
ఓ వ్యక్తి ఎదుగుదలకు చాలా కారణాలంటాయి. వీటిలో అతి ముఖ్యమైనది పట్టుదల. రెండోది అలుపెరగని పోరాటం. ఈ రెండూ ఉన్నాయి కాబట్టి కొలసాని శ్రీనివాసరావు నేడు ప్రముఖ వ్యక్తి అయ్యారు. వ్యాపారంలో రాణిస్తూనే సామాజిక సేవతో ప్రజలకు దగ్గరయ్యారు. వేలాదిమంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజల తలలో నాలుకలా వ్యవహరిస్తున్న ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి. సుప్రభాతం టౌన్ షిప్స్తో ఎంతమందికి గూడు కల్పిస్తున్న ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
కోలసాని శ్రీనివాస రావు స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు. తల్లిదండ్రులు నాగేశ్వరమ్మ - సుబ్బారావు. వీరికి శ్రీనివాస రావు ఏకైక సంతానం. సుబ్బారావు అప్పట్లో ఎస్సెస్సెల్సీ చదివారు. ఉద్యోగం వచ్చినా వ్యవసాయంపై మక్కువతో దానికే అంకితమయ్యారు. శ్రీనివాసరావు బాల్యం మొత్తం గ్రామంలోనే సాగింది. పదో తరగతి వరకు అక్కడే చదువు కున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాచిలర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (బీఎంఎల్టీ) చేశారు. అనంతరం గ్రామంలో కొన్నాళ్లపాటు ల్యాబ్ నిర్వహించారు. ఫర్టిలైజర్స్ షాపు కూడా నడిపారు.
చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు |
వివాహం ఉపాధ్యాయుడిగా చదువులో మెరికలా ఉండే శ్రీనివాస రావులో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండేవి. పదో తరగతిలో ఉండగా స్కూలు ప్రెసిడెంట్గా చేశారు. ఆ సమయంలో స్కూల్లో గ్రంథాలయం, ఆటపాటల కోసం క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడంలో విశేష కృషి చేశారు. బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ లో మంచి ప్రావీణ్యం ఉంది. స్కూలు తరపున పలు పోటీల్లో పాల్గొని పతకాలు తీసుకొచ్చారు. పెదనంది పాడులో ఇంటర్మీడియట్చదువుతున్నప్పుడుకార్యదర్శిగా పనిచేశారు. కాలేజీలో నాటిక పోటీలు నిర్వహించేవారు. కాలేజీకి గుర్తింపు తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
అమరావతిలో ఉద్యోగం
గ్రామంలో ల్యాబ్, ఫెర్టిలైజర్స్ షాప్ నిర్వహిస్తున్న సమయంలో అమరావతిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి గా ఉద్యోగం రావడంతో చేరిపోయారు. అయితే, వేతనం అంతంత మాత్రమే కావడంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పార్ట్ టైం ఉద్యోగిగా చేరారు. 1992 నుంచి మూడేళ్లపాటు ఆ సంస్థలో పనిచేసిన శ్రీనివాసరావు ఆదాయం బాగానే ఉండడంతో ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అదే సంస్థలో పూర్తిస్థాయిలో చేరిపోయారు. అలా 2004 వరకు ఆ సంస్థలో పనిచేశారు.
వరుసగా పదేళ్లు స్టేట్ రికార్డు
రియల్ ఎస్టేట్ సంస్థలో పుష్కర కాలం పాటు పనిచేసిన శ్రీనివాసరావు వరుసగా పదేళ్లు స్టేట్ రికార్డు అందుకున్నారు. వృత్తిలో నిబద్దత ఆయనను అందరికంటే ఓ మెట్టు పైన నిలిపింది. అది ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రతీ ఏటా మూడు లక్షల రూపాయల నగదు బహుమతి అందుకున్నారంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థలో వివిధ హెూదాల్లో పనిచేసిన శ్రీనివాసరావు అందరి మన్ననలు అందుకున్నారు.
సుప్రభాతం టౌన్షిప్స్ పేరుతో సొంత సంస్థ
సుదీర్ఘ కాలంపాటు ఓ సంస్థలో పనిచేసిన శ్రీనివాసరావు 2004లో అందులోంచి బయటకు వచ్చి సుప్రభాతం టౌన్ షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. హైదరాబాద్, షాద్ నగర్, మహేశ్వరం, కందుకూరు, పోచంపల్లితోపాటు అమరావతి లోనూ వెంచర్లు వేసి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తానేంటో నిరూపించుకోవాలన్న పట్టుదలతో నిరంతరం కష్టించి పనిచేస్తూ సుప్రభాతం టౌన్ షిప్షను అగ్రగామి సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు.
వివాహం
ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసరావు ఆగస్టు 1992లో ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి బాబు కొలసాని సాయి చైతన్య, పాప లక్ష్మీ సౌజన్య ఉన్నారు. అమెరికాలో ఎంఎస్ చేసిన సాయి చైతన్య న్యూయార్క్లోనిబ్లూంబర్గ్ మీడియా సంస్థలో కొన్నాళ్లు పాటు పనిచేశాడు. ప్రస్తుతం 'అమెజాన్ గో'లో పని చేస్తు న్నాడు. కుమార్తె లక్ష్మీ సౌజన్య ప్రస్తుతం ఇం టర్ పూర్తి చేసింది. ఐఐటీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఎన్టీఆర్ స్ఫూర్తిగా.. |
వ్యాపారంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరావు ప్రస్తుతం సామాజిక సేవలో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా సేవకు అంకితమయ్యారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వ లక్షణాలకు ముగ్గుడై ఆ పార్టీలో చేరి సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన 'స్మార్ట్ విలేజ్' అభివృద్ధిలో భాగంగా స్వగ్రామం అన్నపర్రును దత్తత తీసుకున్నారు. శ్రీనివాసరావు ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు.
ప్రజలతో మమేకం |
శ్రీనివాసరావు టీడీపీలో యాక్టివ్ గా ఉంటూనే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు విశేష కృషి చేస్తున్నారు. పండుగ సమయాల్లో పేదల మహిళలకు చీరలు, పురుషులకు ధోవతీలు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో నేత్రవైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన ఆపరేషన్లు చేయిస్తూ వారి కళ్లలో వెలుగులు నింపుతున్నారు. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని శివాలయ పునురుద్దరణకు తనవంతు సాయం అందించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో మౌలిక సదుపాయాలుకల్పించారు. గ్రామంలోని అమ్మవారి గుడిచుట్టూ, బీసీ హాస్టల్ చుట్టూ ప్రహరీ కట్టించారు. చర్చ్ల నిర్మాణంలోనూ భాగస్వామ్యమయ్యారు. 25 కాలేజీల్లో 350 మందికి పైగా విద్యార్థులకు ఒక్కొక్కిరికి పది నోటు పుస్తకాలు డిక్షనరీ పంపిణీ చేశారు. వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. లయన్స్ క్లబ్లో గవర్నర్ చైర్మన్ గా శ్రీనివాసరావు వికలాంగుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి కోసం కృత్రిమ కాళ్లు, చేతులు పంపిణీ చేస్తున్నారు. జాక్సిలిన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీని ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన మందులు తయారు చేసి అందిస్తున్నారు.
వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు
కొలసాని శ్రీనివాసరావు సేవకు మెచ్చి పలు సంస్థలు ఆయనను అవార్డులతో సత్కరించాయి. టెక్సాస్లోని 'రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్' యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో శ్రీనివాసరావును గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అసోసియేషన్, ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ లు సేవాచక్ర అవార్డుతో సత్కరించాయి. భారతీ సాంస్కృతిక సంగీత కళావేదిక దివంగత ఎన్టీఆర్ పేరుపై జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. డాక్టర్స్ డే సందర్భంగా 'ఆదర్శ రత్న అవార్డును అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. ఫోన్: 9963 60 6789