ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి అని ఎందుకు పేరు పెట్టారు?
వెదట నేను ఆయన అల్లుడినని వదంతులు వచ్చాయి. వాస్తవానికి ఎల్వీ ప్రసాద్ గారు నాకు ఏమీకారు. అమెరికాలో ఉన్నపుడే మా ఆవిడ, నేనూ కంటి ఆసుపత్రి పెడదామను కున్నాం. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు స్థలం కోసం ఉత్తరం రాశా. ఇస్మత్ పూర్ అనే ప్రాంతంలో ఇచ్చారు. అప్పటికే హైదరాబాద్ ఐ ఇనిస్టిట్యూట్ అనే ట్రస్టును నెలకొల్పాం . 1985 వేసవికాలంలో ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ స్థాపించిన డాక్టరుగారు నన్ను కలిశారు. ఆయన ఇంట్లో ఎల్వీప్రసాద్ గారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారిని కలిశా. ఆయన బంజారాహిల్స్ లో స్థలం ఇచ్చారు. అందుకే మా బోరు సభ్యులందరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిగా పేరుపెట్టాం.
లిచిన్న వయస్సులోనే ఎక్కువ మంది పిల్లలు అద్దాలు పెట్టుకొని కన్పిస్తున్నారు. దీన్నిబట్టి నేత్ర సమస్యలు పెరిగాయని అనుకోవచ్చా? సమస్య పెరిగిందని చెప్పవచ్చు. ప్రజల్లో వచ్చిన అవగాహనతోనూ ఇలా అద్దాలు ధరిస్తున్నారనీ అనుకోవచ్చు. ప్రస్తుతం మయోపియా (హ్రస్వదృష్టి) సమస్య ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎంతసేపు దగ్గర చూపునకే పరిమితమవుతున్న ఈ తరం ఆ సమస్యను ఎదుర్కోబోతోంది. దీనివల్ల దూరం చూపు దెబ్బతింటోంది. చీకటి గదులు, ఎక్కువగా సెల్ ఫోన్లు, టీవీలు చూడటం, బయటికి వెళ్లి ఆడుకోకపోవడం వీటికి కారణాలు. అందుకే చైనాలో కచ్చితంగా బడిలో పిల్లలు రోజూ ఓ గంట బయట మైదానంలో ఆడుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. తక్కువ వెలుతురు వచ్చే గదులకు బదులు... గాజు గదులను నిర్మిస్తోంది. దీనివల్ల మయోపియా సమస్యను కొంతవరకూ తగ్గించవచ్చని భావిస్తున్నారు. మనదేశంలో ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రతీ విద్యార్థికి సాధారణ కంటి పరీక్షలు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. - డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు