సాధించాలన్న తపన, కాస్తంత ధైర్యం ఉండాలే కానీ అడ్డంకులు దూది పింజాల్లా తేలిపోతాయి. పరాజయాలను చూసి మడమ తిప్పితే అవి రెచ్చిపోతాయి. జడలు విప్పి మనముందే డ్యాన్స్ చేస్తూ మరింత భయపెడతాయి. వీటిని ఎదుర్కోవడానికి బాహుబలులు కానక్కర్లేదంటారు గుంటుపల్లి పవన్. వినూత్నమైన ఆలోచనకు కొంత ధైర్యం, మరికొంత నమ్మకాన్ని పెట్టుబడిగా పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని పవన్ నిరూపించారు. దేశంలోని ప్రతి ఒక్కరి నోళ్లలోనూ తన సంస్థ పేరు నానాలన్న తపన ఆయనను వినూత్నంగా ఆలోచించేలా చేసింది. ఫలితంగా ర్యాపిడో' పురుడు పోసుకుంది. ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ హైరింగ్ యాప్ లకు పోటీగా వచ్చిన ర్యాపిడో ఇప్పుడు కోట్లాదిమంది సామాన్యుల అవసరాలను తీరుస్తోంది.
హైదరాబాద్ కు చెందిన పవన్ ఐఐటీ ఖరగ్ పూర్ లో ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేశారు. తర్వాత దక్షిణ కొరియాలోని శాంసంగ్ కంపెనీలో రెండేళ్లు పనిచేశారు. మంచి జీతం, విదేశాల్లో ఉ ద్యోగం.. ఇవేవీ ఆయనకు సంతృప్తిని ఇవ్వలేక పోయాయి. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. తొలుత ఓ సంస్థను స్థాపించి చేతులు కాల్చుకున్నారు. అందులోని అనుభవాలను తన విజయానికి సోపానాలుగా మార్చుకుని నేడు దేశంలోనే అతి పెద్ద బైక్ యాప్ తో కోట్లాదిమందికి చేరువయ్యారు.
చేరువయ్యారు. | పవన్ తల్లిదండ్రులు అంజనీదేవి- అశ్వత్త రామారావు. తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. నిజానికి వీరి స్వస్థలం గుంటూరు అయినా ఏళ్ల క్రితమే భాగ్యనగరానికి వచ్చి స్థిరపడ్డారు. పవన్ ఎనిమిదో తరగతి వరకు హైదరాబాద్ లోనే చదువుకున్నారు. ఆ తర్వాత చదువంతా విజయవాడలో సాగింది. దేశంలోని ప్రముఖ ఐఐటీలలో ఒకటైన ఐఐటీ ఖరగ్ పూర్లో బీటెక్ చేశారు. ఆ వెంటనే ఎలాక్ట్రానిక్ పరికరాల ఉ త్పత్తుల సంస్థ శాంసంగ్లో ఉద్యోగం వచ్చింది. రెండేళ్లపాటు దక్షిణ కొరియాలో పనిచేశారు.
సొంత సంస్థ ఆలోచనలు వుంచి వేతనం, అంతకుమించిన హెూదా.. శాంసంగ్లో ఈ రెండూ పవన్ కు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. సొంతంగా తనకంటూ ఓ సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో రెండేళ్ల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చేశారు. 'ది క్యారియర్' పేరుతో సొంత సంస్థను స్థాపించారు. ఇది ఒక రకంగా మూవర్స్ లాంటిది. వస్తువులను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించేందుకు చక్కని ప్లాట్ ఫాంలా ఇది ఉపయోగపడుతుందని భావించారు. నాణ్యమైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో స్థాపించిన ఈ సంస్థ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఫలితంగా కొన్నాళ్లకే అది మూతబడింది. ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేలా.. తొలి అడుగు తప్పుపడిందని గ్రహించిన పవన్ కుంగిపోలేదు. పరాజయం నేర్పిన అనుభవాలను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకున్నారు. విజయానికి వాటిని ఎలా వాడుకోవాలో ప్రణాళికలు - | రచించారు. స్వతహాగా వ్యాపారి అయిన పవన్ తండ్రి అశ్వత్థ రామారావు కుమారుడిలో ధైర్యం నూరిపోశారు. వ్యాపారంలో ఒడిదొడుకులు సాధారణమని చెప్పుకొచ్చారు. ఈసారి రెట్టించిన ధైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. తల్లిదండ్రులు నూరిపోసిన ధైర్యంతో పవన్ ఈసారి తన ఆలోచనలకు పదును పెట్టారు. తన సంస్థ పేరు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోళ్లలోనూ నానాలని భావించారు. ర్యాపిడోకు అంకురార్పణ ర్యాపిడోకు అంకురార్పణ ఇప్పుడు జనాలు సమయంతో పోటీపడుతున్నారు. క్షణాలను కూడా వృథా చేయడం మానేశారు. గతంలోలా బస్టాండ్ వరకు వరకు నడుచుకుంటూ వెళ్లి బస్సెక్కి వెళ్లే ఓపిక లేదు. బ్యాంకు క్యూలలలో నిల్చుని లావాదేవీలు నిర్వహించేంత తీరకా లేదు. అందుకనే ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ హైరింగ్ యాప్లు, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి మనీ ట్రాన్స్ఫర్ యాప్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నిత్యం కోట్లాదిమంది వీటిని ఉపయోగించు కుంటున్నారు. తాను స్థాపించేది కూడా ఇలానే ఉండాలని పవన్ భావించారు. అందులో భాగంగానే 'ర్యాపిడో? అనే బైక్ యాప్ తో ముందుకొచ్చారు. బాల్య స్నేహితుడు అరవింద్తో కలిసి 2016లో బెంగళూరులో ఈ సంస్థనుప్రారంభించారు.
ఏమిటీ ర్యాపిడో.. ఇది అచ్చం ఓలా, ఉబెర్ వంటిదే. కాకపోతే పూర్తిగా బైక్ యాప్. ఓలా, ఉబెర్ సేవలను మధ్య తరగతి వారు ఉపయోగించు కోవడం ఖర్చుతో కూడుకున్న పనే. సరిగ్గా దీనినే తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వారి కోసం బైక్యాప్ ను తీసుకొచ్చారు. ఒక్క క్లిక్ తో అత్యంత చవకగా, ఇంకా చెప్పాలంటే ఓలా, ఉబెర్ కంటే 50 శాతం తక్కువ ఖర్చుతో గమ్య స్థానాలను చేరుకునే ప్లాన్ చేశారు. బెంగళూరు కేంద్రంగా స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు ఉత్తరాదిలోనూ అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో ర్యావీ దో సేవలు అందుబాటులో ఉన్నాయి. 500కు పైగా ఉద్యోగు లున్నారు. నెలకు 40 లక్షలకు పైగా ఆర్డర్లు.. రూ. 20 కోట్లకు పైగా టర్నోవర్తో సంచనాలు సృష్టిస్తోంది.
2020 నాటికి పది లక్షల ఆర్డర్లే లక్ష్యం తమకేమీ దీర్ఘకాలిక లక్ష్యాలు లేవంటారు పవన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా యాభైవేల ఆర్డర్లు చేస్తున్నామని, మార్చి 2020 నాటికి వీటిని పది లక్షల ఆర్డర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఆదాయం పరంగా నెలకు రూ. 20 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, రాజ మండ్రి, విశాఖపట్టణం, గుంటూరు, తెలంగాణలో | హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ర్యాపిడో సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరా బాద్ లో రోజుకు 30 వేల ఆర్డర్లు, విజయవాడలో పదివేలు, విశాఖలో ఏడువేల వరకు ఆర్డర్లు వస్తున్నట్టు వివరించారు. ఇక్కడ విజయం సాధించిన తర్వాత ఉత్తరాదికి కూడా ఈ సేవలు విస్తరించినట్టు తెలిపారు. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు బాల్యం నుంచే చదువులో చురుగ్గా ఉండే పవన్ లో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక, ఆటపాటల్లో సరేసరి. ఐఐటీ ఖరగపూర్లో చదువుతుండగా కాలేజీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 100, 200 మీటర్ల పరుగు పందేల్లో పాల్గొనేవారు. పుట్ బాల్ లోనూ మంచి ప్రవేశం ఉంది. ధైర్యంగా అడుగేస్తేనే విజయం “మనం ఏ పనిచేసినా కావాల్సింది ధైర్యమే. అది ఒక్కటీ ఉన్నప్పుడు మిగతావన్నీ వాటంతట అవే మన చెంతకు వస్తాయి. తొలిసారి కంపనీ . | పెట్టి మూసేసినప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ | సభ్యులు, స్నేహితులు అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. అది నాకు మానసిక స్థయిర్యాన్ని ఇచ్చింది. రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ నాకు స్పూర్తి. ప్రతీ విషయంలోనూ తల్లిదండ్రులు నాకు అండగా నిలబడ్డారు. నేను వేసే ప్రతీ అడుగు వెనక వారి ప్రోత్సాహం ఉంది. నా సంస్థ సేవలను కోట్లాదిమంది ఉపయోగించుకోవాలని కలలు కన్నాను. సాధించాను. ఇప్పుడు మా సంస్థలో 30 వేల మంది కెప్టెన్లు (బైక్ యజమానులు) ఉన్నారు. వీరిలో స్టూడెంట్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, హెచ్ఆర్ మేనేజర్లు, డెలివరీ బాయ్స్, నిరుద్యోగులు, రిటైర్ అయిన వారు కూడా ఉన్నారు. ఇలా అన్ని రంగాల వారికి మా నుంచి ఆదాయం లభిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అన్నయ్య నాగ తరుణ్, అక్క సాహితి ఉన్నారు. అన్నయ్య అమెరికాలోని ఫిలడెల్ఫియాలో డాక్టర్. వదిన దీపికతో కలిసి అక్కడే స్థిరపడ్డారు. అక్క ఎండీ రేడియాలజీ. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు' అని పవన్ చెప్పుకొచ్చారు.